🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కుసంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన తహసీల్దార్ తులసీరామ్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కుసంగి | 🗓 19 Oct 2026 | ⏰ 07:48 PM

కుసంగి: స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టే విధంగా భద్రతా ప్రమాణాలతో స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేశారని టేక్మాల్ మండల తహసీల్దార్ తులసీరామ్ అన్నారు. సోమవారం టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ వద్ద మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ రేషన్ కార్డులను తయారు చేసిందని, అనేక రకాల భద్రతా ప్రమాణాలతో ఈ కార్డును రూపొందించారని అన్నారు. ఈ కార్డులు రేషన్ సరుకులకు మాత్రమే కాకుండా అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు, క్రికెట్ కోచ్ భగవాన్ రెడ్డి, మొగుల్ రెడ్డి, విక్రమ్ గౌడ్, డాకూరి లక్ష్మయ్య, ఫక్రోద్దీన్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ముత్యంగారి వెంకయ్య, అనిల్ గౌడ్, వెంకట్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది, గ్రామ మహిళలు, లబ్ధిదారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్