రంగారెడ్డి : అమ్మవారి ఆశీస్సులతో అందరికీ విజయం లభించాలని ఎమ్మెల్సీ నాగరికుంట నవీన్ రెడ్డి అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి నందిగామ మండలంలోని చలివేంద్ర గూడలో దుర్గామాత మండపంలో నిర్వహించిన పూజ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ విజయం లభించాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజలు ప్రజలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. షాద్ నగర్ ప్రజలందరిపై అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మాదారం నరసింహ గౌడ్, అనిత శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జంగగళ్ళ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ జగన్, చలివేంద్ర గూడ ఉపసర్పంచ్ బసవయ్య,మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,గోవింద్ రెడ్డి, నాయకులు మొముల బసవేశ్వర్, జి.నరసింహ, హన్మంతు, ఆంజనేయులు, అవినాష్, శ్రీరాములు, ఎన్. మల్లేష్, పి. రవి సభ్యులుగా ఉన్నారు. బండి కృష్ణ, గణేష్ గౌడ్, వెంకటేష్ ముదిరాజ్, కార్తీక్ రెడ్డి, శ్రీను చారి, అరవింద్ మీర్జా, సాగర్, అనిల్, అవినాష్, సాయి చారి బ్యాంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు.






