నారాయణఖేడ్ ప్రతినిధి :దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగళ్పేట్ దుర్గామాత ఆలయంతో పాటు వెంకటాపూర్ గ్రామంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గామాత అమ్మవారిని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభిషేక్ షెత్కార్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ బక్షిరామ్, మండల యువజన విభాగం అధ్యక్షులు మచ్చేందర్, నాయకులు కేశన్న, సత్యం సెట్, సాయిలు, మల్గొండ, అల్లమయ్య, జ్ఞానేశ్వర్ ముదిరాజు, పండరి, లింగయ్య, చింటూ, నాని, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.








