🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 18 Oct 2026 | ⏰ 04:33 PM

మెదక్‌ ప్రతినిధి అక్టోబర్ 18 : తెలంగాణ ఆడబిడ్డలందరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, సామూహిక శక్తికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

తెలంగాణ ప్రజల జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ప్రకృతితో ముడిపడిన అనుబంధాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తుందని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, సాంస్కృతిక ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఏకం చేయడంలో, సాంస్కృతిక చైతన్యాన్ని రగల్చడంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. భావితరాలకు మన గొప్ప వారసత్వాన్ని అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

సద్దుల బతుకమ్మను మహిళలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పండుగ ప్రతి ఇంటా సంతోషం, సౌభాగ్యం, ఐక్యతను నింపాలని కోరుకుంటూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్