🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం – ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 మహాదేవ్ పల్లి | 🗓 18 Oct 2026 | ⏰ 04:46 PM

మహాదేవ్ పల్లి : రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని, రైతులు చెమటోడ్చి పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో కల్హేర్ మండలం మహదేవ్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని కోరారు.

ప్రభుత్వ మద్దతు ధరల వివరాలు:

  • గ్రేడ్-ఏ రకం ధాన్యం: క్వింటాల్‌కు రూ.2,461
  • సాధారణ రకం ధాన్యం: క్వింటాల్‌కు రూ.2,441
  • సన్న వడ్లకు అదనపు ప్రోత్సాహకం: క్వింటాల్‌కు రూ.500 బోనస్

ప్రభుత్వం సన్న రకం వడ్లకు ప్రత్యేకంగా రూ.500 బోనస్ చెల్లిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోందని ఆయన గుర్తుచేశారు.

అలాగే, భవిష్యత్ వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ముందుచూపుతో వ్యవహరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భూగర్భ జలాలు, నీటి లభ్యతకు అనుగుణంగా ముందస్తు పంటల ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సాగునీటిని, విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వాడుకోవాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, ఏపీఎం వినోద్ పాటిల్, ప్రముఖ నాయకులు మాల్డోడి తుకారాం, శ్రీకాంత్ శెట్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఐకేపీ సిబ్బంది మరియు పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్