తాంసి : తాంసి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండ్రత్ అరుణ్ పితృవియోగంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్, ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి నివాసానికి చేరుకున్న ఆడే గజేందర్, దివంగతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడల సంతోష్, తాంసి మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, తాంసి ఉప సర్పంచ్ నర్సింలు, మండల మైనారిటీ చైర్మన్ రజ్జబ్ అలీ, మాజీ సర్పంచ్ గంగారం, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధనుంజయ్ పాల్గొన్నారు. వీరితో పాటు నాయకులు కేమ హనుమండ్లు, శంకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కన్వీనర్ అనుపట్ల సంజీవ్ కుమార్, బోథ్ అసెంబ్లీ మాజీ అధికార ప్రతినిధి ఎండీ సద్దాం, పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.








