మెదక్ అక్టోబర్ 14: వేద పండితుల మంత్రోచరణాలు… భక్తుల జయజయ ధ్వానాల మధ్య పట్టణంలోని కుమ్మరిగడ్డ అనాది హనుమాన్ దేవాలయంలో శ్రీ సంతోషిమాత 41 వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. దేవి శరణన్నవరాత్రుల్లో భాగంగా
గురువారం ఆలయంలో సంతోషిమాతకు అభిషేకం, దుర్గామాతకు పంచామృతాభిషేకం, అనంతరం చండీ హవనం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీమాత మాలదారులు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు అరునార్తి వెంకట రమణ, భట్టి ఉదయ్, రా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వీరేశం, వేద పండితులు భరత్ శర్మ, వైద్య రాజు, వైద్య శ్రీనివాస్, మధుసూదన్, దోర్భల రాజమౌళి, ప్రసాద్, సాయి సుధీర్, స్థానికులు గౌత శేఖర్, అరునార్తి చంద్ర శేఖర్, తొడుపునూరి హరినాథ్, పెండ్యాల చంద్రమోహన్ పాల్గొన్నారు.







