🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా: పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 తాజా వార్త | 🗓 12 Oct 2026 | ⏰ 06:27 PM

నారాయణఖేడ్, అక్టోబర్ 12 : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని కోరారు. ఓటు హక్కు పవిత్రతను కాపాడటం, ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటించడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు.

పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్