మెదక్ అక్టోబర్ 11 : మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆదివారం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి సన్మానించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్లో సీనియర్ జర్నలిస్టు నాగరాజ్ శర్మ కుమార్తె సారె కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, రామాలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, నాయకులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








