భవాని మాత అనుగ్రహంతో ప్రజలందరికి శుభం జరగాలి
ఎల్లికట్ట భవానీ మాత ఆలయంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 11: దసరా శరన్నవరాత్రి భవాని మాత అనుగ్రహంతో ప్రజలందరికి శుభం జరగాలని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలం ఎల్లికట్ట గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ అంబా భవానీ మాత ఆలయాన్ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో వెలిసిన దేవికి ఆయన ప్రత్యేక అభిషేకం,పూజలు,అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, చారిత్రక మరియు ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన ఎల్లికట్ట భవానీ మాత క్షేత్రాన్ని దేవి నవరాత్రుల వేళ దర్శించుకోవడం ఎంతో సంతోషకరమని,ఆ జగన్మాత భవానీ దేవి కరుణాకటాక్షాలతో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన అభినందించారు.


ఈ కార్యక్రమంలో ఎల్లికట్ట సర్పంచ్ వాకిటి నవకిరణి నర్సింహా, మాజీ సర్పంచ్ సాయి యాదవ్, పోమాల్ పల్లి గ్రామ సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కానుగు అనంతయ్య, పాలమకుల చెన్నయ్య, మాజీ సర్పంచ్ నాగర్ కుంట ఉమా ప్రవీణ్ రెడ్డి, అప్పరెడ్డి గూడ మాజీ సర్పంచ్ జెకే నర్సింహా, వెల్జర్ల మాజీ ఎంపిటిసి అశోక్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మాజీ చైర్మన్లు మరియు కమిటీ సభ్యులు, నాయకులు శేరి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





