సృష్టి ఆది శిల్పి, సమస్త వాస్తు శిల్ప కళలకు ఆద్యుడైన శ్రీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రమైన టేక్మాల్‌లోని స్థానిక కాళికా దేవి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ మండల అధ్యక్షులు సిద్దయ్య మాట్లాడుతూ లోక నిర్మాణానికి మూలపురుషుడైన విశ్వకర్మ భగవానుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. విశ్వకర్మ చూపిన మార్గంలో పయనిస్తూ, సమాజ పురోగతికి శ్రమశక్తిని అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ వేడుకల్లో టేక్మాల్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రసాద్, సమాజ పెద్దలు, నాయకులు దుర్గయ్య, బ్రహ్మయ్య, పండరి, గోవింద చారి, ప్రవీణ్, నందు, విజయ్, చందు, సాయి, దుర్గరాజు, కార్తీక్, సాకేత్, మహిళలు రమాదేవి, కల్పన, నాగరాణి, మమత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





