🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చౌదర్‌పల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చీటీ సాయితేజ
చీటీ సాయితేజ 📍 రేగోడ్ | 🗓 04 Oct 2026 | ⏰ 09:03 PM

రేగోడ్ : సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలం చౌదర్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేందర్, కాంగ్రెస్ పార్టీ రేగోడ్ మండల అధ్యక్షుడు మున్నూరు కిషన్ ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామస్థులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని నాయకులు పేర్కొన్నారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో గ్రామ రేషన్ డీలర్ మంద రాములు, గ్రామ పట్వారీ లక్ష్మయ్య, ఆర్ఎస్ఎస్ఆర్ రామ్‌చందర్, ఎస్సీ కాలనీ మెంబర్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మల్కమ్మల బాల్రాజ్‌‌తో పాటు పలువురు వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
చీటీ సాయితేజ
రచయిత గురించి (Author Bio)

చీటీ సాయితేజ

"గత కొన్నేళ్లుగా ప్రజానేస్తం తెలుగు డిజిటల్ న్యూస్ విభాగంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపై ప్రామాణిక కథనాలు అందిస్తారు."

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్