🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

పీఎం సూర్యఘర్‌ ముప్త్‌ బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలి

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 02 Oct 2026 | ⏰ 08:50 PM

మెదక్‌, అక్టోబర్‌ 2: ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ ముప్త్‌ బిజిలీ యోజనను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా రెడ్‌కో డీఎం రవీందర్‌ చౌహన్‌ సూచించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం విద్యుత్‌ ఎస్‌ఈ నారాయణనాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా సేతు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రవీందర్‌ చౌహన్‌ మాట్లాడుతూ 3 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్‌ ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇందులో రూ.78 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. మిగతా మొత్తానికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేసుకుంటే సుమారు 25 ఏళ్లపాటు విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించుకోవచ్చని తెలిపారు.

జిల్లాలో టాటా, అదానీ తదితర కంపెనీల సోలార్‌ ప్యానళ్లు ఏఐ సోలార్‌ వెండర్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సేవా సేతు కార్యక్రమం తొలిరోజే 16 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఎస్‌ఈ నారాయణనాయక్‌, డీఈ రామేశ్వర్‌, డీటీ టెక్నికల్‌ శ్రీనివాస్‌, ఏడీ మోహన్‌బాబు, ఏఈ నవీన్‌, ఏఐ సోలార్‌ వెండర్‌ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్