🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టీయూడబ్ల్యూజే-హెచ్143 ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం

జనార్ధన్
జనార్ధన్ 📍 తాజా వార్త | 🗓 02 Oct 2026 | ⏰ 05:52 PM

మెదక్, అక్టోబర్ 2 జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే-హెచ్143 ఆధ్వర్యంలో మెదక్‌లో శుక్రవారం పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా రాందాస్ చౌరస్తాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి, తమ డిమాండ్లతో కూడిన పోస్ట్‌కార్డులను సీఎం రేవంత్‌రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే-హెచ్143 జిల్లా కన్వీనర్ పబ్బతి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, గతంలో అమలైన ఈజేహెచ్ఎస్ పథకాన్ని పునరుద్ధరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 2 నుంచి 8 వరకు చేపడుతున్న ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్, సీనియర్ జర్నలిస్టులు బీవీకే రాజు, శ్రీనివాస్, గిరి, యాదగిరి, రాఘవులు, ఆంజనేయులు, కార్తీక్, వంశీ, ఉషయ్య, రాడ్వ లక్ష్మణ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్